● ప్రస్తుతం 11.86 మీటర్ల లోతులో..
● ఈ నెలలో భూగర్భ జలాలు
తగ్గే అవకాశం
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలో భూగర్భ జలాలు నిలకడగా ఉన్నాయి. యాసంగి పంటలు త్వరగా కోతకు రావడంతో వ్యవసాయ బోర్ల వినియోగం తగ్గి ఏప్రిల్, మే నెలల్లో నీటి మట్టాలు పెద్దగా పడిపోలేదు. ప్రస్తుతం 11.86 మీటర్ల లోతులో ఉన్నట్లు భూగర్భజల శాఖ వెల్లడించింది. అయితే, ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున నిల్వ ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్ లో బోర్ల వినియోగంతో నీటి మట్టాలు వేగంగా కిందికి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో 82 నీటి పరిశీలక బోరుబావులు ఉండగా 31 వాటి లో 10 మీటర్ల లోపు భూరగ్భ జలాలున్నాయి. 42 పరిశీలక బోరు బావుల్లో 10–20లోపు, అలాగే తొమ్మిది పరిశీలక బోరు బావుల్లో 20 మీటర్లపైన లోతులో ఉన్నట్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది.


