సాక్షి ప్రతినిధి, నిజామాబా ద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)కు ప్రోత్సాహం అందించేందుకు నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పో ర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్) పూర్తిస్థాయిలో స హకరిస్తుందని సంస్థ బిజినెస్ మేనేజర్, ప్లాంటేషన్ ప్రొడక్ట్స్ అధికారి రిచాశర్మ తెలిపారు. ఢిల్లీ లోని ఎన్‌సీఈఎల్ కార్యాలయంలో సంస్థ బిజినె స్ మేనేజర్, ప్లాంటేషన్ ప్రొడ క్ట్స్ అధికారి రిచా శర్మ, సీనియర్ ఆఫీసర్ సంతోష్‌కుమార్‌ను శనివారం జిల్లాకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశా రు. ఇందూరు పసుపును ఆమెకు అందించారు. అనంతరం రిచాశర్మ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ సాగుతో పండించే వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉందని తెలిపారు. రైతులను మెల్లమెల్లగా సేంద్రియ సాగువైపు మళ్లించే దిశ గా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ముందుండాలన్నారు. ఎఫ్‌పీవోల ప్రతినిదులు పాట్కూరి తి రుపతిరెడ్డి, కర్నె లక్ష్మీనర్సయ్య పటేల్, మైలారం రాజారెడ్డి, గడ్డం రాజేందర్‌రెడ్డి ఉన్నారు.


