రుద్రూర్: మండలంలోని అక్బర్‌నగర్ గ్రామ పంచాయతీలో శనివారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మొరం అనుమతుల ఆంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. సమీపంలోనే గుట్ట ఉన్నందున వేబిల్లు లేకుండా గ్రామస్తులకు మొరం తరలింపుకు అనుమతి ఇవ్వాలని యువకులు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం వేబిల్లు తప్పనిసరి అని తహసీల్దార్ తారాబాయి స్పష్టం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులకు వే బిల్ లేకుండా మొరం ఇవ్వాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. వానకాలంలో గుట్ట ప్రాంతం నుంచి వరద నీరు వస్తోందని, ఈ సమస్యను పరిష్కారించాలని గ్రామస్తులు సభ దృష్టికి తెచ్చారు. సభలో ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తహసీల్దార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ సీతారామరాజు ఈఘటనపై స్పందిస్తూ క్షమాపణలు కోరారు. ఎంపీవో అరవింద్, ఏఈవో వెంకటేశ్, ఉపసర్పంచ్ హబీబ్‌ఖాన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


