● హోటళ్లు, టిఫిన్ సెంటర్ల పై సివిల్ సప్లయ్ అధికారుల దాడులు
బోధన్: గృహవసరాలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్లను వ్యాపారాల కోసం వాడుకుంటున్నారనే సమాచారం మేరకు శనివారం ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట, ఎంఎస్సీఫారం, సాటాపూర్ గేట్ ప్రాంతాల్లో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల పై సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయా హోటళ్లల్లో తనిఖీలో చేపట్టగా 15 గృహవసరాల గ్యాస్ సిలిండర్లను గుర్తించి పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. హోటల్ యాజమానుల పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పట్టుబడిన గ్యాస్ సిలిండర్లను స్థానిక గ్యాస్ ఏజెన్సీ గోదాంకు తరలించినట్టు సివిల్ సప్లయ్ అధికారులు ఆకుల మహేశ్, పవన్‌లు తెలిపారు.


