మాటు కాలువ మరమ్మతు పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మాటు కాలువ మరమ్మతు పనులు ప్రారంభం

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

మాటు కాలువ మరమ్మతు పనులు ప్రారంభం నిధుల మంజూరు కోసం వినతి విద్యార్థులకు ఉచిత హాస్టల్‌ వసతి పిల్లలను ప్రయివేటుకు పంపొద్దు దివ్యాంగ క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి

నవీపేట: మండలంలోని నాళేశ్వర్‌ శివారులోని మాటు కాలువ మరమ్మతు పనులను సర్పంచ్‌ ఆర్మూర్‌ లావణ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఆర్మూర్‌ లావణ్య, ఉ ప సర్పంచ్‌ ఆర్మూర్‌ శ్రీనివాస్‌లు మాట్లాడారు. ఎగువ ప్రాంతం నుంచే వరదనీటిని గ్రామంలోని ఊర చెరువుకు మళ్లించే మాటు కాలువకు గత కొన్నేళ్లుగా మరమ్మతులు లేక పూడుకుపోయిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సుదర్శన్‌రెడ్డిని కలువగా రూ. 37 లక్షలు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్‌ మగ్గారి హన్మాండ్లు, మాజీ సర్పంచ్‌ నర్సింగ్‌రావ్‌, వీడీ సీ ప్రతినిధులు గంగాధర్‌, పోతన్న, సంపత్‌, పోశెట్టి, కారోబార్‌ భుజంగ్‌రావ్‌ పాల్గొన్నారు.

వేల్పూర్‌ : వేల్పూర్‌ మండలం అక్లూర్‌ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న పనులను పూర్తి చే యడానికి నిధులు మంజూరు చేయాలని హైద రాబాదులో ిపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను సర్పంచ్‌ జిన్న జనార్దన్‌ శనివారం కలిసి విన్నవించారు. మల్కా చెరువును విస్తరించడానికి, బైపాస్‌ డ్రెయినేజీ నిర్మించడానికి నిధులు ఇవ్వాలని కోరారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విన్నవించారు. నిధుల మంజూరుకు బస్సు సౌకర్యం కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకుంటానని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హామీ ఇచ్చినట్లు సర్పంచ్‌ పేర్కొన్నారు.

పెర్కిట్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత హాస్టల్‌ వసతి కలదని కళాశాల ప్రిన్సిపాల్‌ సుభాష్‌ అన్నారు. ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి గ్రామంలో శనివారం ప్రభుత్వ బాలుర జూ నియర్‌ కళాశాలలో అధ్యాపకులు అడ్మిషన్ల కో సం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలుర కాలేజీలో చేరితే ఎన్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్‌షిప్‌ సౌకర్యం కలదన్నారు. కా ర్యక్రమంలో చంద్ర శేఖర్‌, గంగాధర్‌, చంద్రమోహన్‌, శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): గ్రామంలో చదువుకునే పిల్లలను ప్రయివేటుకు పంపొద్దని, ప్రభుత్వ పాఠశాలకే పంపాలని మారంపల్లి సర్పంచ్‌ ఆరే గంగాధర్‌ ఊరి ప్రజలకు సూచించారు. శనివారం ప్రభుత్వ టీచర్లతో కలిసి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని, విద్యా బోధనకు మంచి ఉపాధ్యాయులు ఉన్నారని సూచించారు. ఉప సర్పంచ్‌ రాజేశ్వర్‌, వార్డు సభ్యులున్నారు.

ఆర్మూర్‌: దివ్యాంగ క్రీడాకారులకు గ్రూప్స్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో జీవో నెంబర్‌ 74 ప్రకారం రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పారా అఽథ్లెటిక్స్‌ సలహాదారు, అంతర్జాతీయ దివ్యాంగుల బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు తలారి జాన్కంపేట్‌ సంజీవయ్య డిమాండ్‌ చేశారు. ఆర్మూర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన దివ్యాంగ క్రీడాకారులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో 2025 నూతన క్రీడా విధానం అమలులోకి వచ్చి పది నెలలు కావొస్తున్నా పారా క్రీడాకారుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement