పునర్విభజన కష్టాలు.. | - | Sakshi
Sakshi News home page

పునర్విభజన కష్టాలు..

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

తొమ్మిది ఏళ్లైనా తొలగని

రామన్నపేట్‌ గ్రామ ముఖచిత్రం

మోర్తాడ్‌: మండలాలు, గ్రామాల పునర్విభజనపై ఉన్న శ్రద్ధ వాటితో ఏర్పడిన ఇబ్బందులను తొలగించే అంశంపై పాలకులకు లేకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. మోర్తాడ్‌ మండలంలో కొనసాగిన రామన్నపేట్‌ను 2016లో వేల్పూర్‌ మండలంలో విలీనం చేశారు. భౌగోళికంగా రామన్నపేట్‌ వేల్పూర్‌ మండల కేంద్రానికి సమీపంలో ఉంది. ఈ పునర్విభజనతో తమ సమస్యలు తొలగిపోతాయని గ్రామస్తులు ఆశించారు. కానీ ఫలితం భిన్నంగా ఉండటంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖల పరంగానే పునర్విభజన చేసిన పాలకులు పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ ఇతర శాఖల విషయంలో దృష్టి సారించలేదు. రామన్నపేట్‌ గ్రామం ఇప్పటికి మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కొనసాగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ సబ్‌ సెంటర్‌ చౌట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉంది. మొదట మోర్తాడ్‌ పీహెచ్‌సీ పరిధిలో ఉండగా ఇక్కడ కమ్యూనిటీ ఆస్పత్రి ఏర్పాటైంది. దీంతో ఈ పీహెచ్‌సీకి సంబంధించి ఈ గ్రామంలోని సబ్‌సెంటర్‌ ఆలనా పాలన చౌట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలోకి మార్చారు. వాస్తవానికి పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి రామన్నపేట్‌ వేల్పూర్‌ మండలంలోనే కొనసాగాల్సి ఉంది. అప్పట్లో పునర్విభజన చేసిన నాయకులు, అధికార యంత్రాంగం అన్ని శాఖల విషయంలో సరైన దృష్టి నిలపలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే రామన్నపేట్‌ కొన్ని శాఖల విషయంలో వేల్పూర్‌ మండలంలో మరి కొన్ని శాఖల అంశాల్లో మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలంలో కొనసాగుతుందని వెల్లడైతుంది. ప్రజలు తమకు ఉన్న సమస్యల విషయంలో ఏదైనా తేల్చుకోవాలంటే శాఖల పరంగా ఏ మండలం పరిధిలో తమ పని ఉంటే ఆ మండలానికి పరుగులెత్తాల్సి వస్తోంది.

మోర్తాడ్‌ మండలంలోని రామన్నపేట్‌ వేల్పూర్‌ మండలంలో విలీనం

రెవెన్యూ, పంచాయతీరాజ్‌ పరంగా వేల్పూర్‌ మండలం

పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ ఇతర

సేవలు మాత్రం మోర్తాడ్‌లో..

గ్రామస్తులకు తప్పని ఇబ్బందులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement