ఆర్మూర్‌టౌన్: ఈనెల 20న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. ఆర్మూర్ కోర్టులో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ కేసులు పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక అన్నారు. ప్రజలు ఈవేదిక ద్వారా న్యాయం పొందాలని సూచించారు. న్యాయవాదులు పరస్పర అవగాహనతో రాజీ పరిష్కారాలకు కృషి చేయాలని అన్నారు.
రెంజల్(బోధన్): మండలంలోని తాడ్‌బిలోలి గ్రా మానికి చెందిన లింగాల సాయిలు అనే బాధితునికి మంజూరైన రూ.18,000 సీఎంఆర్‌ఎఫ్ చెక్కును శ నివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు అందించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సు దర్శన్‌రెడ్డి సహకారంతో తక్కువ సమయంలో బా ధితునికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నా రు. రెంజల్ సింగిల్ విండో మాజీ చైర్మెన్ సాయరెడ్డి, రామాలయం చైర్మన్ కార్ఖాన శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు నర్సయ్య, శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఖుద్దూస్, నాయకులు సద్దాం, సురేష్‌పటేల్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్‌లోని లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీ వద్ద గల బ్రాహ్మణ కుంటలో పడి మరణించిన ముగ్గురు పిల్లల కుటుంబాలను కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్ శనివారం పరామర్శించారు. కంది హరీష్, వర్షిణి తల్లిదండ్రులు మహేష్, లక్ష్మి దంపతులను, ధ్యారంగుల అరవింద్ తల్లిదండ్రులు సురేష్, పద్మలను సునీల్‌కుమార్ పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీనిచ్చారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, నాయకులు పర్స అనంతరావు, సంగ్యా నాయక్ తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు మానాల మోహన్‌రెడ్డి...
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేడం రమేష్ తండ్రి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ తండ్రి రాజన్న ఇటీవల మరణించడంతో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. ఆయన వెంట నాయకులు సర్పంచ్ రేవతి గంగాధర్, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బోనగిరి భాస్కర్, సుంకెట రవి, తిప్పిరెడ్డి శ్రీను, పడిగెల ప్రవీణ్, బద్దం మోహన్‌రెడ్డి, రఫీ, లక్ష్మీకాంతం, చిటికేశి గంగాధర్ తదితరులు ఉన్నారు.


