గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

రెంజల్‌/పెర్కిట్‌/డొంకేశ్వర్‌/నందిపేట్‌ : గ్రామసభల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మండల ప్రత్యేకాధికారిణి కృష్ణవేణి పేర్కొన్నారు. శనివారం రెంజల్‌ మండలం రెంజల్‌, తాడ్‌బిలోలి, మౌలాలితండా గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు తిరుపతి లలిత, తెలంగాణ శంకర్‌, అశోక్‌ నాయక్‌ల ఆధ్వర్యంలో గ్రామ సభలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామసభలో పలు తీర్మానాలను ఆమోదించారు. తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌, ఎంపీడీవో కమలాకర్‌లతో పాటు ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలూర్‌ మండలం దేగాం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తహసీల్దార్‌ రమేశ్‌ మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ అమలులో బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ) పాత్ర కీలకమన్నారు. సర్పంచ్‌ ఇట్టెడి లింగారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్‌, ఆర్‌డబ్ల్యూఈఎస్‌ డీఈ కౌశిక్‌, ఇరిగేషన్‌ ఏఈ శ్రావణ్‌, ఎస్‌ఐ అర్ఫాత్‌ తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్‌ మండలం గాదేపల్లిలో సర్పంచ్‌ చిన్నరెడ్డి అధ్యక్షత నిర్వహించిన గ్రామసభలో కొత్త జీపీ భవనం, వీవో బిల్డింగ్‌ నిర్మాణం, వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానాలు చేశారు. చర్చించారు. ఉప సర్పంచ్‌ సందీప్‌, కార్యదర్శి సాయిలు, వార్డు సభ్యులున్నారు. నందిపేట్‌ మండలం మాయాపూర్‌ గ్రా మసభ సర్పంచ్‌ బ్యాగరి జీవన్‌ అధ్యక్షతన నిర్వహించారు.తహసీల్దార్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సంతోష్‌రెడ్డి పాల్గొని గ్రామస్తులకు పలు సూచనలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement