పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

ఆర్మూర్‌: కేంద్రం పెంచిన ఎరువుల ధరలను వెంట నే తగ్గించాలని, ఎంఎస్‌పీ చట్టం అమలు చేయా లని ఏఐయూకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీ.ప్రభాకర్‌ డి మాండ్‌ చేశారు. ఆర్మూర్‌లో అఖిల భార ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్‌) జాతీయ మహాసభ పి లుపు మేరకు ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఏఐయూకేఎస్‌ కార్యాలయం నుంచి ఆర్మూర్‌ సబ్‌ క లెక్టర్‌ కార్యాలయం వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ ని ర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించా రు. జిల్లా కార్యదర్శి కిషన్‌ అధ్యక్షతన నిర్వహించిన ధర్నానుద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌ మాట్లాడారు. ఎరువుల ధర ఒక్కో బస్తా పై రూ.300 నుంచి రూ.500 వరకు పెంచి రైతుల వెన్ను విరు స్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హా మీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అ నంతరం తమ డిమాండ్లను తెలుపుతూ ఆర్మూర్‌ స బ్‌కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియాకు వినతిపత్రాన్ని స మర్పించారు. జిల్లా నాయకులు గంగారాం, యూ. రాజన్న, జే.శేఖర్‌, ఏ.సాయులు, పోశన్న, టీ.గంగాధర్‌, ఈ.రమేష్‌, భద్రి తదితరులు పాల్గొన్నారు.

రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

బోధన్‌: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఎడపల్లి తహసీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ దత్తాద్రికి అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఆ సంఘం రాష్ట్ర కమిటి సభ్యుడు గుమ్ముల గంగాధర్‌, నాయకులు శ్రీపతి మల్లేశ్‌,రవి, సుదర్శన్‌, హన్మాండ్లు, గంగాధర్‌,వైద్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement