కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరు డబ్బాలో వేయాలని భీమ్‌గల్ మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే నాగమణి అన్నారు. శనివారం ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 3,4,5,6 వార్డుల్లో వార్డు సభలు చైర్ పర్సన్ నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. కమిషనర్ గజానంద్ ఎజెండా అంశాలను ప్రజలకు వివరించారు. వర్షాకాల సన్నద్ధత, ప్రజలు డెంగీ, మలేరియా బారిన పడకుండా జాగ్రత్తలను వివరించారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. వైస్ చైర్ పర్సన్ సంటి లత, కౌన్సిలర్‌లు తోట సతీష్. గున్నాల బాలలక్ష్మి. బోదిరే లావణ్య తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి వార్డు సభలు
బోధన్‌టౌన్(బోధన్): మున్సిపల్‌లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వార్డుసభలను నిర్వహిస్తోందని బల్దియా వైస్ చైర్మన్ మీర్ ఇలియాస్ అలీ అన్నారు. శనివారం పట్టణంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో 10 నుంచి 20 వరకు వార్డుల వార్డుసభలను నిర్వహించారు. ఈసందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడారు. తడిపొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరించే ఆటోలకు ఇవ్వాలని, డ్రెయినేజీల్లో ప్లాస్టిక్ కవర్‌లతో పాటు ఇతర చెత్త వేయరాదని సూచించారు. బోధన్ పట్టణంలో జరుగుతున్న సర్ సర్వేకు ప్రజలు, ప్రజా/ప్రతినిధులు సహకరించాలని, ఆర్‌ఐ నాగేశ్వర్‌రావ్ అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


