కమ్మర్‌పల్లి(భీమ్‌గల్)/ మాక్లూర్/నందిపేట్: మ హిళా సంఘ భవనాలకు భూమిపూజ శనివారం ప్ర జాప్రతినిధులు, అధికారులు భూమిపూజ చేశారు. భీమ్‌గల్ మండలం పురాణీపేట, కుప్కల్ గ్రామా ల్లో ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్, మాక్లూర్ మండలం చిక్కిలి, గుంజిలి గ్రామాలలో ఎంపీడీవో బ్రహ్మానందం, నందిపేట్ మండలం మల్లారం గ్రా మంలో సర్పంచ్ తబస్సుం మహిళసంఘ భవనాలకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈజీఎస్ నిధులు రూ.10లక్షలో భవనాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఏఈలు రమేశ్, సాయి సూర్య, రాజ్‌కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, ఏపీఎం ప్రమీల, సీసీలు శ్రీనివాస్, రఘు, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.


