తెయూ(డిచ్‌పల్లి): భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ జి.రాంబాబు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెయూలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో జోయ్‌అలుక్కాస్ జ్యువెలర్స్ నిజామాబాద్, వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘మొక్కల పంపిణీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాంబాబు మాట్లాడుతూ పర్యావరణానికి హానికారకంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. కార్యక్రమంలో జోయ్‌అలుక్కాస్ జ్యువెలర్స్ మార్కెటింగ్ అధికారి మదన్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ హలీంఖాన్, అధ్యాపకు లు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


