ఒకే రోజు ఐదువేల మొక్కలు | - | Sakshi
Sakshi News home page

ఒకే రోజు ఐదువేల మొక్కలు

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

ఒకే రోజు ఐదువేల మొక్కలు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఐదు వేల మొక్కలు నాటారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రతి మండలంలో రెండు ప్రాంతాలను గుర్తించి మొక్కలను నాటించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ సిబ్బంది సర్పంచులను ఆహ్వానించారు. మొక్కలు నాటేచోట ముగ్గులు వేశారు. ఇటు అటవీ అధికారులు కూడా ఆయా రేంజ్‌లలో మొక్కలు నాటాను. ఎన్‌జీవోలు, కమ్యునిటీ సంఘాలు సైతం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement