చదివింది మరిచిపోకుండా... | - | Sakshi
Sakshi News home page

చదివింది మరిచిపోకుండా...

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

ఉత్సాహంగా పాల్గొంటున్నాం లెక్కలు ప్రాక్టీస్‌ చేస్తున్నాం బొమ్మలు గీస్తున్నాం

పాఠాలు అన్నీ గుర్తుంటున్నాయి

మోర్తాడ్‌(బాల్కొండ): విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలు, లెక్కలు ఇతర అంశాలను మరిచిపోకుండా ఉండేందుకు వేసవి సెలవుల్లోనూ నిత్యం రెండు, మూడు గంటలపాటు సమయం కేటాయిస్తున్నారు. గురువు బోయిడి నర్సయ్య నిత్యం వాట్సాప్‌ గ్రూప్‌లో ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ పాఠ్యంశాలపై పట్టు సంపాదించుకుంటున్నారు. బాల్కొండ మండలం బస్సాపూర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కొన్నేళ్లుగా వేసవి సెలవులను వృథా చేయకుండా చదువుకోసం వినియోగిస్తున్నారు. కరోనా కన్నా ముందు నుంచే బస్సాపూర్‌ విద్యార్థులు యేటా సెలవుల్లో రెండు, మూడు గంటలపాటు ఆన్‌లైన్‌ తరగతులను కొనసాగిస్తుండడం విశేషం.

ప్రతి సెలవుల్లోనూ నేను చదువుకున్న పాఠాలు మరిచిపోకుండా ఉండేందుకు మా గురువు నర్సయ్య ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్నారు. మేము ఉత్సాహంగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నాం.

– లతీక్ష, 4వ తరగతి

మా సారు పాఠశాలలో చెప్పిన లెక్కలను ఇప్పుడు సెలవుల సమయంలో ప్రాక్టీస్‌ చేస్తున్నాం. వాట్సాప్‌లో ఆయన లెక్కలు పంపిస్తే వాటిని ఇంటి వద్ద ప్రాక్టీస్‌ చేసి తిరిగి వాట్సాప్‌లో పంపిస్తున్నాం. తప్పులుంటే సరిచేసుకోమంటూ సూచనలు ఇస్తున్నారు. – పి.దేవాన్ష్‌, 4వ తరగతి

పాఠ్యాంశాలు గుర్తుండేలా బొమ్మలను గీస్తూ మా మాస్టర్‌ పాఠాలు చెప్పారు. ఇప్పుడు హోంవర్క్‌లో ఆయన చెప్పిన పాఠాలకు అనుగుణంగా బొమ్మలను గీస్తున్నాం. సెలవులను వృథా కాకుండా సద్వినియోగం చేసుకుంటున్నాం.

– శివరక్షిత్‌, 5వ తరగతి

మా గురువు రోజు మా తల్లిదండ్రుల వాట్సాప్‌కు పాఠ్యంశాలకు సంబంధించిన సూచనలు, సలహాలు పంపుతారు. ఆయన సూచించిన విధంగా మేము హోమ్‌వర్క్‌ చేసి వాట్సాప్‌లో పంపిస్తున్నాం. పాఠాలు ఏవీ మరచిపోకుండా గుర్తుంచుకుంటున్నాం.

– బి. కారుణ్య, 5వ తరగతి

వేసవి సెలవుల్లోనూ ఆన్‌లైన్‌లో

సలహాలు, సూచనలు

ఇంటి వద్దనే ప్రాక్టీస్‌ చేస్తున్న

విద్యార్థులు

వాట్సాప్‌ సమూహం ద్వారా

పర్యవేక్షిస్తున్న టీచర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement