మాక్లూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని గ్రామాల్లో ఫ్రై డే, డ్రై డే కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆలూర్ మండలం కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో పరిశుభ్రత పాటించేలా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకునేలా సర్పంచ్‌లకు తెలియజేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది బాధ్యతయుతంగా పనిచేయాలని సూచించారు.
నిజామాబాద్‌అర్బన్ : పెండింగ్ కేసులను త్వరిగతిన పూర్తిచేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. కమిషనర్ కార్యాలయంలో గ్రేవ్ క్రైమ్ కేసుల దర్యాప్తుపై శుక్రవారం సీఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో నమోదైన హత్య, హత్యాయత్నం, దోపి డీ, మహిళలు, చిన్నారులపై నేరాలు, ఫోక్సో కేసులు, మోసం, అపహరణ తదితర గ్రేవ్ క్రైమ్ కేసులను సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరిగతిన పూర్తి చేయాలన్నా రు. కేసు దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, కా ల్ డేటా విశ్లేషణ చేపట్టాలన్నారు. ప్రతి కేసులో సాక్ష్యాధారాలను పటిష్టంగా సేకరించడం ద్వారా కోర్టులో నిందితులకు శిక్ష పడేలా చూ డాలన్నారు. సమావేశంలో నిజామాబాద్, ఆ ర్మూర్, బోధన్ ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, మల్లేశ్, సీసీఆర్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి గత నెల 19న కామారెడ్డి జిల్లా తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన అరవింద్(5) తప్పిపోయాడు. తల్లిదండ్రులు 1వ టౌన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.


