చైన్‌స్నాచర్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచర్‌ అరెస్టు

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఒకే రోజు 28 మందికి శిక్షలు

మోర్తాడ్‌(బాల్కొండ): మెండోరా పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసులో నిందితుడు గుర్జంత్‌ సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జాన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. బాల్కొండలోని రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం క్రితం సోన్‌పేట్‌కు చెందిన ఉప్పరి గణేశ్‌ తన భార్య గంగు, కూతురు మనీషతో కలిసి ముప్కాల్‌ నుంచి బుస్సాపూర్‌ శివారుకు చేరుకోగా ముసుగు ధరించిన నిందితుడు గంగు మె డలో నుంచి రెండు తులాల పుస్తెల తాడు తెంచుకొ ని పారిపోయాడు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన గు ర్జంత్‌ సింగ్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. మెండోరా పోలీసులను సీఐ అభినందించారు.

నిజామాబాద్‌ రూరల్‌ : రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుండారం శివారులో సర్దార్‌ తేజాసింగ్‌(36) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షరీఫ్‌ శుక్రవారం తెలిపారు. నిజామాబాద్‌ నగరంలోని గాజులపేటకు చెందిన తేజాసింగ్‌ మద్యానికి బానిసై తీవ్ర మనస్తాపంతో ఉరేసుకున్నాడని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కామారెడ్డి క్రైం : మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు శుక్రవారం ఒకే రోజు 28 మందికి శిక్షలు విధించా యి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని కోర్టులలో హాజరుపర్చగా ఐదుగురికి ఒకరోజు జైలుశిక్షతోపాటు మొత్తం 28 మందికి రూ.36,500 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపి తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement