
నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి
లక్ష్మణచాంద: నాలుగు లేబర్ కోడ్‌లను వెంట నే రద్దు చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజన్న కోరారు. మండలంలోని వడ్యా ల్ గ్రామంలో సోమవారం నిర్వహించిన స మావేశంలో మాట్లాడారు. కార్మికులకు నెలకు రూ.26వేల కనీస వేతనం ఇవ్వాలని, కనీస పె న్షన్ రూ.9వేలు ఇవ్వాలని కోరారు. బీడీ పరిశ్రమపై విధించిన 28శాతం జీఎస్టీ తగ్గించాలని, కోర్ఫా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చే శారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చే యాలని కోరారు. సమావేశంలో నాయకులు గంగన్న, సాయన్న, భీమేశ్, నారాయణ, శంకర్, రమేశ్, రాజేశ్వర్, మురళి, చిన్నక్క, లక్ష్మి, రాజమణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.