Jammu And Kashmir: నుదుటిపై బొట్టు పెట్టుకుందని విద్యార్థినిని చితకబాదిన టీచర్‌

Teacher Beats Student For Wearing Tilak To School in Jammu And kashmir - Sakshi

శ్రీనగర్‌: ఏ వర్గానికి చెందిన వారైనా విద్యాలయంలో సమానమే. ధనికులు, పేదలు, హిందూ, ముస్లిం అనే బేధాలు ఉండవు.  విద్యార్థులకు సద్భుద్ధి నేర్పి వారిని ప్రయోజకులు చేసే బాద్యత ఉపాధ్యాయుల మీదే ఉంటుంది. మతాలన్నీ సమానమేనని, మనుషులంతా ఒక్కటేనని కూడా పిల్లలకు బోధించాలి. కానీ విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే టీచరే వారిపట్ల క్రూరంగా ప్రవర్తించాడు. నుదుటిపై బొట్టు పెట్టుకొని స్కూల్‌కు వచ్చిన ఓ విద్యార్థినిపై టీచర్‌ చేయిచేసుకున్న ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది.  

రాజౌరీ జిల్లాలో హిందూ కుటుంబానికి చెందిన ఓ బాలిక నుదుటినా బొట్టు పెట్టుకొని పాఠశాలకు వెళ్లింది. ఈ క్రమంలో నిసార్‌ అహ్మద్‌ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చితకబాదాడు. అయితే బాలికను  ఉపాధ్యాయుడు కొట్టిన దృశ్యాలు వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
చదవండి: Viral Video: ఓరిని తెలివి సల్లగుండా.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా!

దీంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసినట్లు రాజౌరీ జిల్లా విద్యాధికారి తెలిపారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు టీచ‌ర్ నిసార్ అహ్మ‌ద్ స‌స్పెన్ష‌న్‌లోనే ఉంటార‌ని పేర్కొన్నారు. కాగా బాలికను కొట్టినట్లు, అభ్యంతరకరమైన పదాలతో దూషించినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఎస్పీ జిల్లా ఎ‍స్పీ మహ్మద్‌ అస్లాం పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 
చదవండి: భారత్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ కలకలం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top