Leopard In Rajasthan: దేశంలోనే తొలిసారి కనిపించిన ‘గులాబీ’ చిరుత

Rare Pink Leopard Spotted In Rajasthan Ranakpur Hills For First Time - Sakshi

జైపూర్‌: అత్యంత అరుదైన ‘గులాబీ’ చిరుత దేశంలో తొలిసారి కంటపడింది. రాజస్థాన్‌ ఆరావళి పర్వతాల్లోని రణక్‌పూర్ ప్రాంతంలో ఈ గులాబీ చిరుతపులిని స్థానికులు గుర్తించారు. అయితే భారతదేశంలో స్ట్రాబెర్రీ రంగు చర్మంతో ఉన్న చిరుతపులి కనిపించడం ఇదే మొదటిసారి. విస్తారమైన అటవీ ప్రాంతం కారణంగా గులాబీ రంగు చిరుతపులిని చాలాసార్లు చూసినట్లు రణక్‌పూర్, కుంభాల్‌ఘర్‌లోని గ్రామస్తులు చెప్పినట్లు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్‌) ఫతే సింగ్ రాథోడ్ తెలిపారు. అయితే ఈ పింక్‌ చిరుత ఇటీవల కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారన్నారు. 
చదవండి: ఆ పాఠశాలకు అందరూ స్కర్టుతోనే రావాలి.. ఎందుకో తెలుసా?

వన్యప్రాణుల సంరక్షణకర్తగా చిరుతపులిని రక్షించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాథోడ్‌ వివరించారు. కాగా నాలుగు రోజుల శోధన తర్వాత ఈ గులాబీ చిరుతను ఫొటో తీసినట్లు వన్యప్రాణుల సంరక్షణ ఫొటోగ్రాఫర్ హితేష్ మోత్వాని తెలిపారు. దీని వయసు 5,6 ఏళ్లు ఉంటుందన్నారు. ఇంతకముందు 2012, 2019లో గులాబీ రంగు మచ్చలు కలిగి ఉన్న ఈ అరుదైన చిరుతపులిని  దక్షిణాఫ్రికాలో కనిపించింది. 
చదవండి: నదిలో నీళ్లు చల్లుతున్నారు.. కొత్త టెక్నిక్‌ కాదు.. మరేంటి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top