రోగికి డ్యాన్స్‌ స్టెప్‌లతో ఫిజియోథెరఫీ వ్యాయామాలు!: వైరల్‌ వీడియో!

Nurse Danced Cheer Up Paralytic Patient During Physiotherapy Session  - Sakshi

రోగులు తమ అనారోగ్యాన్ని మరిచిపోయేలా డాకర్లు కౌన్సిలింగ్‌లు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. పేషంట్‌ మరీ నిరాశ నిస్పృహలకు లోనైతే వాళ్లకు ప్రత్యేకంగా మానసికనిపుణుల పరివేక్షణలో ఉంచి చికిత్స అందిచడం వంటివి చేస్తారు. కానీ వాటన్నింటికి భిన్నంగా పక్షవాతం వచ్చిన రోగిని ఉత్సాహపరిచేందుకు నర్సు డ్యాన్స్‌ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

అసలు విషయంలోకెళ్తే... ఆ వీడియోలో నర్సు పక్షవాత రోగికి వినూత్న పద్ధతిలో కొన్ని ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసేలా సహాయం చేసింది. నర్సు అతనికి కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చూపుతున్నప్పుడు రోగి మంచం మీద పడుకుని ఉన్నాడు.  అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట కూడా ప్లే అవుతుంటుంది. అయితే పేషంట్‌ నర్సు స్టెప్పులను అనుకరించటానికి ప్రయత్నించాడు. వీడియో చివర్లో ఆమె రోగికి తన చేతులతో  చేతి కదలిక వ్యాయామాలు చేయడంలో కూడా సహాయపడుతుంది.

దీంతో ఆ పేషంట్‌ ముఖంలో నవ్వు చిగురించడమే కాకుండా తను కూడా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తూ తనకు తెలియకుండానే చచ్చుబడిన అవయవాలను కదిపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఫిజియోథెరపీ సెషన్‌లో రోగికి సహాయం చేస్తున్న నర్సును ఆయన ప్రశంసించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top