అవన్నీ అవాస్తవాలే.. నమ్మొద్దు: ఇండిగో | Indigo Denies Claims Of Banning Sindoor And Tilak | Sakshi
Sakshi News home page

అవన్నీ అవాస్తవాలే.. నమ్మొద్దు: ఇండిగో

Apr 25 2026 4:20 PM | Updated on Apr 25 2026 5:10 PM

Indigo Denies Claims Of Banning Sindoor And Tilak

సిబ్బంది వస్త్రధారణ విషయంలో ఇండిగో కొత్త నిబంధనలు తెచ్చిందంటూ ఇటీవల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. సింధూరం, తిలకంపై నిషేధం వార్తలను ఖండిస్తూ.. కల్పితాలుగా కొట్టిపారేసింది. తిలకం, సింధూరం, మంగళసూత్రం వంటి వాటిపై ఆంక్షలు విధించినట్లు వచ్చిన కథనాలపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్నీ అసత్యాలేనని.. తప్పుడు వార్తలను నమ్మొద్దంటూ స్పష్టం చేసింది.

సింధూరం, తిలకం సిబ్బంది ధరించకుండా నిషేధించామన్న వాదనలను తోసిపుచ్చిన ఇండిగో సం‍స్థ.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న తమ గ్రామింగ్ పాలసీ (వేషధారణ నిబంధనలు) డాక్యుమెంట్లు ‘తప్పు’ అంటూ శనివారం స్పష్టం చేసింది.

ఎక్స్(ట్విట్టర్‌) యూజర్.. ఇండిగో గ్రామింగ్ హ్యాండ్‌బుక్‌కు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ పత్రాల్లో తిలకం, సింధూరం, మంగళసూత్రం, కలావా(చేతికి కట్టే పవిత్ర దారం) వంటి వాటిని స్పష్టంగా నిషేధించినట్లు.. హిజాబ్, టర్బన్ (పాగా)లను అనుమతించినట్లు కనిపించింది.

దీనిపై స్పందించిన ఇండిగో.. ధృవీకరించని, కల్పిత పత్రాలను షేర్ చేయవద్దని పేర్కొంది. తమ నిబంధనలు అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపింది. "అన్ని వర్గాలను కలుపుకొనిపోయే పని వాతావరణాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని.. మా సిబ్బంది, కస్టమర్ల భద్రత, శ్రేయస్సు మా మొదటి ప్రాధాన్యత అని ఇండిగో స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement