మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత

Ex PM Manmohan Singh Illness Treatment In AIIMS Hospital Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ బుధవవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో మన్మోహన్ సింగ్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం బలహీనంగా ఉండి, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 88 ఏళ్ల మన్మోహన్ సింగ్‌ ఈ ఏడాది మొదట్లో కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.

చదవండి: Lakhimpur Kheri Incident: ఆ కేంద్ర మంత్రిపై వేటు వేయకపోతే అంతే సంగతా? జరిగేది అదేనా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top