ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన | Election Commission of India has removed 5. 18 voter names | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన

Apr 13 2026 4:56 AM | Updated on Apr 13 2026 4:56 AM

Election Commission of India has removed 5. 18 voter names


ఏకంగా 5.18 కోట్ల ఓట్ల తొలగింపు

సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) సర్వే రెండో దశలో భాగంగా 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓట్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతంగా ప్రక్షాళన చేసింది. పారదర్శకమైన ఎన్నికలే లక్ష్యంగా నకిలీ, బోగస్‌ ఓట్లకు చెక్‌ పెడుతూ ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తి చేసింది. 

ఈ భారీ ప్రక్షాళనలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నకిలీ, బోగస్, చనిపోయిన ఓటర్ల పేర్లు ఇలా మొత్తంగా 5.18 కోట్ల పేర్లను జాబితా నుంచి అధికారులు తొలగించారు. ఈ సవరణల అనంతరం ఆయా రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 45.81 కోట్లకు చేరుకుంది. గతంతో పోలిస్తే 10.2 శాతం మేర ఓటర్ల సంఖ్య తగ్గడం గమనార్హం. మొత్తంగా 66,88,636 పేర్లు ఓటర్ల జాబితా నుంచి తీసేశారు. 

అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 25.47 లక్షల ఓట్లకు కోత పడగా.. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్‌లో 24.16 లక్షల పేర్లను అధికారులు తొలగించారు. శుక్రవారం యూపీ తుది ఓటర్ల జాబితా విడుదల కావడంతో రెండో దశ ప్రక్షాళన ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండో దశ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను యూపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement