గూగుల్‌లో ఈ 3 విషయాలు వెతకొద్దు.. సెర్చ్‌ చేశారంటే జైలుకెళ్లడం ఖాయం!

Be Careful Don Not Search These 3 Things On Google You May Go To Jail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచం డిజిటల్‌ మయమైంది. అదీ ఇదీ అని కాకుండా ఏ చిన్న సందేహం వచ్చినా ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తాం. గూగుల్‌, యూట్యూబ్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌, బైడూ, యాండెక్స్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది గూగుల్‌ తల్లివైపే మొగ్గు చూపుతారు. అయితే, అక్కడేది వెతికినా పర్లేదు అనుకుంటే పొరపాటే! కాలం మారింది.. క్రైంను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. గూగుల్‌లో కొన్ని విషయాల గురించి సెర్చ్‌ చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే. అవేంటో చూద్దాం!

1. చైల్డ్‌ పోర్నోగ్రఫీ
చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్‌ చేసినా పోక్సో చట్టం కింద జైలు ఖాయం అవ్వొచ్చు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తస్మాత్‌ జాగ్రత్త!
చదవండి👉🏼 గుడ్‌బై ఐపాడ్‌.. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు..

2. బాంబుల తయారీ
బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

3. అబార్షన్‌
అబార్షన్‌ చేయడమెలా? అని గనుగ గూగుల్‌లో వెతికితే కటకటాలు తప్పవు. గర్భస్రావాలను నిరోధించేందుకు భారత్‌ గట్టి చట్టాలను రూపొందించింది. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్‌ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు. డాక్టర్‌ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి.
చదవండి👉🏻 చైనా అధ్యక్షుడికి బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top