పెరుగుతున్న అలీగఢ్‌ కల్తీ మద్యం మృతుల సంఖ్య

22 Succumb Aligarh Hooch Tragedy 5  Arrested In Uttar Pradesh - Sakshi

అలీగఢ్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 22కు చేరింది. మరో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలియజేశారు. వారంతా జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. లోధా, ఖైర్, జవాన్‌ పోలీస్‌స్టేషన్లో పరిధిలో 15 మంది వ్యక్తులు ఈ కల్తీ మద్యం కారణంగా మరణించారని జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌ శుక్రవారం వెల్లడించారు.

కేసుకు సంబంధించి అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కలానిది నైతాని చెప్పారు. లిక్కర్‌ కల్తీకి కారణమని భావిస్తున్న అనిల్‌ చౌధరి కూడా వారిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. అనిల్‌ సన్నిహితులైన రిషి శర్మ, విపిన్‌ యాదవ్‌ల కోసం గాలిస్తున్నామన్నారు. వారిపై రూ 50 వేల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. అనిల్‌ చౌధరికి మంచి రాజకీయ పలుకుబడి ఉన్నట్లు ఓ పోలీస్‌ అధికారి చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

(చదవండి: అనాథ పిల్లలకు ఉచిత విద్య)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top