ప్రభుత్వానికి ఆదా యం పెరగడం ఎంత ముఖ్యమో.. సామా న్య ప్రజల సొంతింటి కల కూడా అంతే ముఖ్యమైంది. మార్కె ట్ విలువల పెంపు నిర్ణయంలో ప్రజల ఆర్థిక సామార్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్ విలువల పెంపుతో ప్రభుత్వానికి ఆ దాయం సమకూరవచ్చు. కానీ ఒకేసారి భారీ గా పెంచడంతో కొనుగోలుదారులు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల మార్కెట్‌లో లావాదేవీలు తగ్గే అవకాశం ఉంది. ప్రజలు, రియల్ వ్యాపారులు మార్కెట్ విలువల పెంపుపై పునః సమీక్షించాలని కోరుతున్నారు.
– పీవీ సాగర్, పుర లైసెన్స్‌డ్ ఇంజినీర్,నారాయణపేట
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. సబ్ రిజిస్ట్రార్లకు మార్కెట్ విలువలను నిర్ణయించే అధికారం లేదు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, రిజిస్ట్రేషన్‌శాఖ ఆదేశాల మేరకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువల అమలు మా బాధ్యత. ప్రజలకు సరైన సమాచారం అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యం.
– వెంకటస్వామి, సబ్ రిజిస్ట్రార్,
నారాయణపేట
●


