మాగనూర్: మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దుకాణాల్లో విత్తనాలు, ఎరువుల నిల్వలు, లైసెన్స్, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులను పరిశీలించారు. రాబోయే వానాకాల వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ సూచనలు అందేలా చూడడంతో పాటు, వారికి అవసరమైన సాంకేతిక సూచనలు సహకారం అందించాలని సుదర్శన్‌గౌడ్ సూచించారు. రైతులు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు.


