రోడ్డెక్కితే ముప్పే! | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కితే ముప్పే!

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

ఫిట్‌‘లెస్‌’ బస్సులు..

నిబంధనలు ఏం చెబుతున్నాయి

ఏడాదిన్నర క్రితం 185వ చట్టం క్లాజ్‌ (ఎఫ్‌) తర్వాత క్లాజ్‌ (జీ) ప్రకారం విద్యాసంస్థల బస్సుల కోసం అదనపు నిబంధనలు జోడించారు. స్కూల్‌ బస్సుపై కళాశాల/పాఠశాల పేరు, ఫోన్‌, సెల్‌ నంబర్లతో పాటు పూర్తి చిరునామాను బస్సు ఎడమవైపు, బస్సు ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాల్సి ఉంటుంది.

● 60ఏళ్లు దాటిన డ్రైవర్‌ను నియమించుకోరాదు. పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్‌, బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.

● బస్సు డ్రైవర్‌ను నియమించే సమయంలో అతడి లైసెన్స్‌ను ఆర్టీఏ కార్యాలయంలో ఒకసారి సరిచూసుకోవడంతో పాటు బస్సును ఐదేళ్ల పాటు నడిపిన అనుభవం ఉండాలి.

● బస్సులో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై పెద్ద అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాయాలి.

మహబూబ్‌నగర్‌ క్రైం: పాఠశాలల పునఃప్రారంభ సమయం ఆసన్నమవుతోంది. పిల్లలను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూల్‌బస్సుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పలు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కాలం చెల్లినవి, సామర్థ్యంలేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థుల ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఈ నెల 15న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రైవేటు స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

నిబంధనలకు విరుద్ధంగా..

చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నాయి. ముఖ్యంగా అటెండెంట్‌ లేకుండానే డ్రైవర్లతో బస్సులను తిప్పడం.. ఒక రూట్‌లో వెళ్లే బస్సును మరో రూట్‌లో నడపడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాల జారీకి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 1,574 విద్యాసంస్థల బస్సులు ఉండగా జూన్‌ 8వ తేదీ వరకు 885 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ పరీక్షకు వచ్చాయి. మరో 689 బస్సులు ఇంకా ఫిట్‌నెస్‌ చేయించలేదు. ఈ బస్సులకు ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్లు ఎక్కితే ప్రమాదం పొంచి ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా 469 స్కూల్‌ బస్సులు ఉండగా.. 50 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బస్సులన్నింటికీ విద్యాసంస్థల యాజమాన్యాలు ఏటా ఆర్టీఓ వద్ద ఫిట్‌నెస్‌ పరీక్షలు జరిపి.. అనుమతి పత్రాలు పొందాల్సి ఉంది. అదే విధంగా బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణాశాాఖకు హామీపత్రం సమర్పించాలి. అయితే పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన పలు పాఠశాలల యాజమాన్యాలు.. మరమ్మతు, ఇతర కారణాలతో పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవడం లేదని తెలుస్తోంది.

జిల్లా బస్సులు ఫిట్‌నెస్‌ ఫిట్‌నెస్‌

ఉన్నవి లేనివి

మహబూబ్‌నగర్‌ 482 317 165

నాగర్‌కర్నూల్‌ 305 194 111

వనపర్తి 253 144 109

జోగుళాంబ గద్వాల 277 166 111

నారాయణపేట 257 64 193

నిబంధనలు

ఉల్లంఘిస్తే చర్యలు

ప్రైవేటు స్కూల్‌ బస్సులకు గడవులోపు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలి. లేనిచో రవాణాశాఖ ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టి.. నిబంధనలు పాటించని స్కూల్‌ బస్సులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ పరీక్షలకు వచ్చిన ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి.. ఫైర్‌ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స బాక్స్‌, బస్సు బ్రేక్‌, కండీషన్‌ ఇలా ప్రతీది పరిశీలిస్తున్నాం. ఏదైనా బాగాలేకపోతే వెంటనే రిటన్‌ పంపిస్తున్నాం. కనీసం లైట్‌ లేకపోయినా సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా స్కూల్‌ బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం. – నర్సింహస్వామి,

ఎంవీఐ, మహబూబ్‌నగర్‌

ఉమ్మడి జిల్లాలో స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ ఇలా..

బస్సులో తప్పనిసరిగా ఉండాల్సినవి..

ప్రతి స్కూల్‌ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స బాక్స్‌ ఉండాలి.

బస్సులో తప్పకుండా ఒక అటెండర్‌ను ఉంచాలి.

అతను తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి.

బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు ఉంచాలి. విద్యార్థి ఎక్కాల్సిన ప్రదేశం, దిగాల్సిన ప్రదేశం నమోదు చేయాలి.

బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో

డ్రైవర్‌కు వారు కనిపించే విధంగా మిర్రర్‌ ఏర్పాటుచేయాలి.

ముఖ్యంగా బస్సు ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌లో అగ్నిమాపక పరికరం ఉండేలా చూసుకోవాలి.

బస్సు సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్‌ ఉండాలి.

బస్సు పాఠశాల కమిటీ పేరుమీద రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలి.

బస్సు తయారీ సంసవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు

ప్రతి బస్సుకు హ్యాండ్‌బ్రేక్‌, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి.

బస్సు అద్దాలకు ఆనుకుని అడ్డంగా ఇనుప

గ్రిల్స్‌ ఏర్పాటుచేయాలి.

నాణ్యమైన ఇంజిన్‌, స్టీరింగ్‌, రూఫ్‌, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి.

విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి.

స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలపై యాజమాన్యాల నిర్లక్ష్యం

ఉమ్మడి జిల్లాలో 1,574 బస్సులకు గాను 885కు మాత్రమే పరీక్షలు

కాలం చెల్లిన, సామర్థ్యంలేని వాహనాలతో పొంచి ఉన్న ముప్పు

విద్యార్థుల భద్రత పట్టని అధికారులు

ప్రభుత్వ బడుల్లో తాగునీటికి తిప్పలు

నిరుపయోగంగా వాటర్‌ ప్లాంట్స్‌

మిషన్‌ భగీరథ నీరు సరఫరా

పట్టించుకోని విద్యాధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement