కేంద్ర పెట్టుబడి సాయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాం. అన్నాదమ్ముల భాగపరిష్కారాలు జరిగిన తర్వాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం చేతిలో పట్టాదారు పాసు పుస్తకాలు పట్టుకొని వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరిగా. కానీ కొత్తగా భూమి పట్టా చేసుకున్న వారి పేర్లు చేర్చేందుకు కేంద్రం నుంచి ఆదేశాలు రావాలని అధికారులు చెబుతున్నారు. కొత్త వారికి కూడా పెట్టుబడి సాయం అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి.
– సంజీవరెడ్డి, రైతు, మరికల్
దరఖాస్తులు తీసుకోవాలి..
కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వారు కూడా పీఎం కిసాన్ నమ్మాన్ నిధికి దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఏడేళ్లుగా వ్యవ సాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. కానీ ఫలితం లేకపోవడంతో వదిలేసుకున్నా. – యాదయ్య, రైతు, తీలేర్
అనుమతి రావాల్సి ఉంది..
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి 2019, ఫిబ్రవరి 1 కటాఫ్ తేదీగా నిర్ణయించింది. ఆ తేదీలోపు భూములు ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోనే పెట్టుబడి సాయం జమ అవుతోంది. తర్వాత భూములు పొందిన వారికి అందడం లేదు. కటాఫ్ తేదీ పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తాం. – సక్రియానాయక్,
జిల్లా వ్యవసాయ అధికారి
●


