మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: క్రికెట్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి అన్నారు.అండర్–16 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నీలో భాగంగా నగర శివారులోని సమర్థ స్కూల్ మైదానంలో శనివారం మహబూబ్‌నగర్ – నారాయణపేట జట్ల మధ్య మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం ఆయన మాట్లాడారు. క్రమశిక్షణతో ఆడితే విజయం సాధించవచ్చన్నారు. జిల్లా క్రీడాకారులు ఐపీఎల్, రంజీ, భారత జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సీనియర్ క్రీడాకారుడు రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ విజయం
నారాయణపేటతో జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 74 పరుగుల తేడాతో నారాయణపేటపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ 28 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జట్లులో సయ్యద్ హమేద్ 52 పరుగులు చేశాడు. నారాయణపేట బౌలర్లు సాయిహర్షిత్ 2, యెహెతేశామ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణపేట జట్టు 23.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలర్లు ధనుష్ 4 వికెట్లు, సబిల్ 3 వికెట్లు తీశారు.


