వేలం పాటల ఆదాయం రూ.8.10 లక్షలు | - | Sakshi
Sakshi News home page

వేలం పాటల ఆదాయం రూ.8.10 లక్షలు

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

మంగపేట : మండల పరిధిలోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపుల నిర్వహణపై గురువారం నిర్వహించిన బహిరంగ వేలం పాటల ద్వారా రూ.8.10 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్‌చార్జ్‌, కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో 2026 మే 15 నుంచి 2027 జూన్‌ 25 వరకు కొబ్బరి కాయలు, పూజా సామగ్రి విక్రయాలకు 2 షాపులు, 2 క్యాంటీన్‌లు, 2 బొమ్మలు, గాజులు, దేవుడి ఫొటోలు విక్రయ షాపులకు బహిరంగ వేలం పాటలను వరంగల్‌ నాగమయ్య దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకటయ్య సమక్షంలో గురువారం నిర్వహించారు. వేలం పాట లో 15 మంది పాల్గొనగా కొబ్బరి కాయలు, పూజా సామగ్రి విక్రయాల షాపు నంబర్‌ నంబర్‌ 1 నర్సింహారావు రూ 2,25,000, షాపు నంబర్‌ నంబర్‌ 2 ఎం.అనురాధ రూ.2,25,000, హోటల్‌, కూల్‌డ్రింక్స్‌ షాపు నంబర్‌ 1 శివయ్య రూ.1,10,000, షాప్‌ నంబర్‌ 2ను సతీష్‌ రూ.1,10,000కు పాట పాడి దక్కించుకున్నారు. అలాగే బొమ్మలు, గాజుల షాపు నంబర్‌ 1 గోవర్ధన్‌ రూ.70వేలకు, షాప్‌ నంబర్‌ 2 వెంకటేశ్వర్లు రూ.70వేలలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement