మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ దర్శకుడు

సీనియర్ దర్శకుడు భారతీరాజా మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. భారతీరాజా అనారోగ్యం కారణంగా గత నెల 24వ తేదీ ఇదే హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. జలుబు, అజీర్ణం సమస్యతో బాధపడుతున్న ఆయనకు అత్యవసర విభాగంలో వైద్య సేవలు అందించారు.
సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న భారతీరాజా ఆరోగ్యం మెరుగుపడడంతో ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో శుక్రవారం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వార్తలు