ఈద్‌కి ఫిక్స్‌ | Salman Khan SVC63 to release on Eid 2027 | Sakshi
Sakshi News home page

ఈద్‌కి ఫిక్స్‌

Apr 25 2026 5:40 AM | Updated on Apr 25 2026 5:40 AM

Salman Khan SVC63 to release on Eid 2027

సల్మాన్  ఖాన్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్‌వీసీ 63’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా విడుదల ఖరారైంది. 2027 ఈద్‌కి (రంజాన్‌ పండగ) ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవల ముంబైలో ఆరంభమైంది.

ఈ చిత్రాన్ని 2027 ఈద్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శుక్రవారం చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హీరో సల్మాన్‌ ఖాన్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా అభిమానుల కోసం ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ఎస్‌వీసీ 63’ విడుదలకు చాలా రోజులు ఉందని మీరు నిరాశపడకండి. మీ ఎదురు చూపులకు తగినట్లుగానే ఈ చిత్రం ఉంటుంది’’ అని పేర్కొన్నారు సల్మాన్‌ ఖాన్‌.    

Advertisement
 
Advertisement
Advertisement