సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఎమ్‌4 ఎమ్‌’ | M4M: Motive for Murder Set for May 8 2026 Release | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఎమ్‌4 ఎమ్‌’

Apr 7 2026 12:12 AM | Updated on Apr 7 2026 12:48 PM

M4M: Motive for Murder Set for May 8 2026 Release

అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్‌ ఆచార్య ప్రధాన పాత్రల్లో మోహన్   వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ ‘ఎమ్‌4 ఎమ్‌: మోటివ్‌ ఫర్‌ మర్డర్‌’. మోహన్   మీడియా క్రియేషన్స్ పతాకంపై ఎమ్‌సీ విన్ గ్రూప్‌ యూఎస్‌ఏ సహకారంతో మోహన్ వడ్లపట్ల నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్‌ కానుంది. ‘‘మా సినిమాను కాన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించడాన్ని మేం గర్వంగా ఫీలవుతున్నాం.

అలాగే ముంబైలో ప్రీమియర్‌ షో ప్రదర్శించగా మంచి పాజిటివ్‌ రెస్పాన్స్ లభించింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ మా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తోంది. అదేవిధంగా అమెరికాలో టెక్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ మా మూవీని విడుదల చేస్తోంది. మర్డర్‌ మిస్టరీగా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని మేకర్స్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement