కమల్-రజనీకి విలన్‌గా మెగా డైరెక్టర్? | Director Shankar To Make His Acting Debut In Rajinikanth And Kamal Haasan Multistarrer Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Kamal Rajini Movie: విలన్‌గా ఊహించని పేరు? నిజమేనా?

Apr 25 2026 3:55 PM | Updated on Apr 25 2026 4:08 PM

Kamal Rajinikanth Movie Villain Details Latest Update

సినిమాలు తీసే దర్శకులు తర్వాతి కాలంలో నటులుగా మారడం అనే ట్రెండ్ తమిళంలో ఎప్పటినుంచో ఉంది. కేఎస్ రవికుమార్, సెల్వరాఘవన్ తదితరులు ఇప్పటికే కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మరో స్టార్ డైరెక్టర్ చేరబోతున్నాడట. ‍రజనీ-కమల్ మల్టీస్టారర్ కోసం ఈయన నటుడిగా మారబోతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

(ఇదీ చదవండి: ‍'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్)

కమల్‌హాసన్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. నటుడిగా కాస్త జోరు తగ్గించినప్పటికీ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ 173వ మూవీలో కమల్ నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా. శిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఓ వీడియో వదలగా అదేమో హైప్ పెంచేసింది. ఇప్పుడు ఆ హైప్‌ని రెట్టింపు చేసే విషయం ఒకటు బయటకు వచ్చింది.

కమల్‌హాసన్‌తో 'భారతీయుడు', రజనీకాంత్‌తో రోబో, శివాజీ లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. రీసెంట్ టైంలో ఈయన తీసిన గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 చిత్రాలు, బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో తర్వాతి ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో అసలు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ఈయన నటుడిగా మారబోతున్నాడని, అది కూడా రజనీ-కమల్‌కి విలన్‌గా చేయబోతున్నారని అనేసరికి ఆసక్తికరంగా అనిపించింది. మరి ఇది నిజమా కాదో అనేది తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాలేమో?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement