‘వాల్తేరు వీరయ్య’ మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో భారీ హిట్ అందుకున్న చిరు.. బాబీతో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం పూర్తిగా భారీ యాక్షన్ సీన్స్‌తో నిండిన కథతో రానుందని మేకర్స్ తెలిపారు. వాస్తవంగా ఈ మూవీ ఫిబ్రవరి నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన జన నాయగన్ విడుదల విషయంలో జాప్యం ఏర్పడటంతో కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఫైనల్‌గా చిరు- బాబీల సినిమా షూటింగ్ మే నెలలో దాదాపు ప్రారంభం అవుతుందని టాక్.


