'మా లైఫ్‌లో నువ్వు ఉండటం అదృష్టం'.. బిగ్‌బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్ | bigg boss Siva Jyothi Emotional post On Her Marriage Anniversery | Sakshi
Sakshi News home page

Siva Jyothi: 'మా లైఫ్‌లో నువ్వు ఉండటం అదృష్టం'.. శివజ్యోతి స్పెషల్ పోస్ట్

Apr 26 2026 3:01 PM | Updated on Apr 26 2026 3:44 PM

bigg boss Siva Jyothi Emotional post On Her Marriage Anniversery

బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి పేరు అందరికీ సుపరిచితమే.  ఈ ఏడాది ప్రారంభంలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 12న తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తనకు కూతురు పుట్టిందని జెండర్ రివీల్ చేసింది. ఈ ఏడాది ఆమెకు మరింత స్పెషల్‌గా మారింది.

ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో ప్రత్యేకంగా తన భర్తకు విషెస్ తెలిపింది. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ గంగా అంటూ తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకమైనది… ఎందుకంటే మాతో పాటు మా చిన్న తల్లి కూడా ఉన్నారంటూ రాసుకొచ్చింది. మా జీవితంలో నువ్వు ఉండటం మా అదృష్టం.. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది బిగ్‌బాస్ శివజ్యోతి. ఇది చూసిన పలువురు సినీతారలు ఈ జంటకు పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement