సమంతతో ఫైట్‌ చేయనున్న హీరో.. ఒకేసారి రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌

Bichagadu2 To Clash With Samantha Shaakuntalam At The Box Office - Sakshi

కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రం బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమా చిత్రీకరణలోనే విజయ్‌ ఆంటోనీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్‌.

ఏప్రిల్‌14న ఈ బిచ్చగాడు-2ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్‌ చేశారు. అయితే సరిగ్గా అదేరోజు సమంత నటించిన శాకుంతలం చిత్రం​ కూడా రిలీజ్‌ కానుండటంతో ఈసారి బాక్సాఫీస్‌ వద్ద ఫైట్‌ కనిపించనుంది. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top