'నాకేలాంటి దురుద్దేశం లేదు.. తమన్నా కాళ్లు పట్టుకుంటా' | Annu Kapoor Defends Crass Comment On Tamannaah Bhatia | Sakshi
Sakshi News home page

Annu Kapoor: 'నాకేలాంటి దురుద్దేశం లేదు.. తమన్నా కాళ్లు పట్టుకుంటా'

Apr 24 2026 5:09 PM | Updated on Apr 24 2026 6:15 PM

Annu Kapoor Defends Crass Comment On Tamannaah Bhatia

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అన్ను కపూర్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తమన్నాపై డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తమన్నా చాలా తెల్లగా ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా.. స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ ఐటమ్ సాంగ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో తమన్నా డ్యాన్స్ గురించి మాట్లాడారు. అదే సమయంలో ఆమె శరీర రంగుపై కామెంట్స్ చేయడంతో వివాదానికి దారితీసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అన్ను కపూర్‌ ఈ వివాదంపై స్పందించారు. తన కామెంట్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అదే మాటను తాను మిల్కీ బాడీ అని చెబితే సమస్య వచ్చేది కాదేమోనని అన్నారు. కేవలం లాంగ్వేజ్ మారినంత మాత్రాన అర్థం మారదన్నారు. తమన్నాను ప్రశంసించడానికే అలా అన్నానని.. అంతే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని తెలిపారు. నా కామెంట్స్‌తో తమన్నా బాధపడి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు.. ఆమె కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయం కాదన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement