అవాస్తవాలు ఆవేదనను కలిగించాయి: సాయి పల్లవి | Actress Sai Pallavi Comments On Her Nativity | Sakshi
Sakshi News home page

అవాస్తవాలు ఆవేదనను కలిగించాయి: సాయి పల్లవి

Apr 23 2026 7:29 AM | Updated on Apr 23 2026 8:39 AM

Actress Sai Pallavi Comments On Her Nativity

సౌత్‌ ఇండియా స్టార్‌ నటి సాయి పల్లవి తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు.  తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన ఈ బ్యూటీ  వైద్య విద్యను పూర్తి చేసి భారతీయ కథానాయకిగా విజయం సాధించారు. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ఈమె సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికిగా రాణిస్తున్నారు. తాజాగా హిందీ ప్రేక్షకుల మనసులను దోచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. 

హిందీలో సాయిపల్లవి కథానాయకిగా నటించిన ఏక్‌ దిన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం  రామాయణ అనే రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రాల్లో సీతగా నటిస్తున్నారు. సాయిపల్లవిని చాలా మంది నటీమణుల మాదిరిగానే ఒక విషయం గాయపరిచింది. ఈమె గత రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మీరు మలయాళి కదా తెలుగులో ఎలా మాట్లాడగలుగుతున్నారు అనే ప్రశ్నకు తాను మలయాళీ కాదు తమిళమ్మాయి అని బదులిచ్చారు. 

ఆ విషయాన్ని వక్రీకరించి రెండేళ్ల తరువాత ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్రచారం తనను చాలా బాధించిందన్నారు. తాను తమిళ అమ్మాయిని, తన పూర్వీకులు తమిళం అని మాత్రమే చెప్పానని,  ఇతర భాషలనో, ఇతరులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు అని ఆమె పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement