అమావాస్య సెంటిమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

అమావాస్య సెంటిమెంట్‌

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

● తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం తక్కువే.. ● దండేపల్లిలో సార్లు ఫుల్‌.. విద్యార్థులు నిల్‌! ● చెన్నూర్‌ మండలం ఆస్నాద జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలకు విద్యార్థులు ఎవరూ రాకపోవడంతో ఉపాధ్యాయులు ఎదరుచూస్తూ కనిపించారు. కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 35మందికి ఐదుగురే హాజరయ్యారు. ● బెల్లంపల్లి పట్టణంలోని చాలా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదైంది. జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దావ స్వాతి, ఎంఈవో పోచన్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

● తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం తక్కువే.. ● దండేపల్లిలో సార్లు ఫుల్‌.. విద్యార్థులు నిల్‌!

దండేపల్లి/చెన్నూర్‌రూరల్‌/చెన్నూర్‌/బెల్లంపల్లి: అమావాస్య సెంటిమెంటుతో జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు హాజరు కాలేదు. దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 161మందికి ఐదుగురే వచ్చారు. 27మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా.. ఈ రోజు అమావాస్య రేపు లేదా ఎల్లుండి నుంచి వస్తారు అంటూ సమాధానం వచ్చింది. దండేపల్లి ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులకు నలుగురే హాజరయ్యారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మండలంలోని గుడిరేవు, నెల్కివెంకటాపూర్‌ ప్రాథమిక పాఠశాలలతోపాటు వెల్గనూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొత్తగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు.

దండేపల్లి: ఐదుగురే విద్యార్థులు హాజరు

కత్తెరసాల ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement