కొత్త యూనిట్‌ పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొత్త యూనిట్‌ పనులు పూర్తి చేయాలి

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

జైపూర్‌: 800మెగావాట్ల కొత్త యూనిట్‌ నిర్మాణ పనుల్లో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) తిరుమల్‌రావు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటులో సోమవారం ఆయన పర్యటించారు. ఎస్టీపీపీలో కొనసాగుతున్న 800మెగావాట్ల నిర్మాణ పనులు పరిశీలించారు. సేఫ్టీ కంట్రోల్‌ రూమ్‌, ట్రాక్‌హాపర్‌ పనులు సందర్శించి భద్రతా చర్యలు, ఆధునిక రైల్‌ వ్యాగన్‌ టిప్లర్‌ విధానంపై అధి కారులతో సమీక్షించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం మదన్‌మోహన్‌, ఏజీఎంలు సుధాకర్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, కొత్త ప్లాంటు కోఆర్డినేటర్‌ వేణుగోపాల్‌, డీజీఎం శ్రీనివాస్‌, ఎస్‌వోటూ ఈడీ వెంకటయ్య, ఎస్‌ఈ రాము, రక్షణాధికారి సురేశ్‌ పాల్గొన్నారు.

విద్యాసంస్థల బస్సులు తనిఖీ

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం విద్యాసంస్థల బస్సుల తనిఖీలు ప్రారంభించారు. మంచిర్యా ల ఐబీ చౌరస్తాలో బస్సుల ఫిట్‌నెస్‌, వాహన ధ్రువీకరణ, బీమా, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, అగ్నిమాపక యంత్రాల నిర్వహణ, విద్యార్థుల రిజిష్టర్‌ పరిశీలించారు. ఓ కళాశాల బస్సు నిబంధనలకు విరుద్ధంగా ఉందని గుర్తించి కేసు నమోదు చేసి సీజ్‌ చేశామని జిల్లా రవాణా శాఖ అధికారి వెల్ది గోపికృష్ణ తెలిపారు. ఈ నెల 25వరకు రోజూవారీగా తనిఖీలు చేపడుతామని తెలిపారు. ఏఎంవీఐ సూర్యతేజ, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement