ప్రపంచ దేశాలకు మోదీ పాలనే దిక్సూచి | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ దేశాలకు మోదీ పాలనే దిక్సూచి

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

● ఎంపీ గోడం నగేశ్‌

● ఎంపీ గోడం నగేశ్‌

జన్నారం: ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పాలనే దిక్సూచిగా నిలుస్తోందని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. మండలంలోని మొర్రిగూడ, కిష్టాపూర్‌, రోటిగూడ గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను (జీడీపీ) మూడో స్థానంలోకి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌, వికసిత్‌ భారత్‌ పేరుతో దేశాన్ని 2047 వరకు ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంచడమే ప్రధాని లక్ష్యమన్నారు. ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తనఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. అనంతరం మొర్రిగూడ, రోటిగూడ గ్రామాలకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. కిష్టాపూర్‌లో బీసీమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముఖేశ్‌గౌడ్‌ను ఎంపీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు రితీశ్‌ రాథోడ్‌, మండల అధ్యక్షుడు మధుసూదన్‌రావు, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రినాయక్‌, సర్పంచ్‌ వాసాల నరేశ్‌, మండల ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్‌, జిల్లా కౌిన్సిల్‌ సభ్యుడు కొంతం శంకరయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాజరావ్‌, బీసీ మోర్చా అధ్యక్షుడు గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement