పచ్చిరొట్టతో నేల సారవంతం | - | Sakshi
Sakshi News home page

పచ్చిరొట్టతో నేల సారవంతం

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

● ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు తట్టుకునేలా.. ● నీటి నిల్వ, భూసారం, పంట దిగుబడులకు దోహదం

మంచిర్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం పంటల సాగుకు రైతన్నలు ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్‌ సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు రాయితీపై అందించేందుకు ఎరువులు, విత్తనాలు మండలాలకు తరలిస్తున్నారు. పచ్చిరొట్ట పైర్ల నుంచి లభించే సేంద్రియ ఎరువుల విత్తనాలు మండలాలకు తరలించారు. ఎల్‌నినో ప్ర భావంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షపు నీరు వృథా పోకుండా భూమిలో ఇంకేలా పొలానికి నీటిని, తేమశాతం, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకునే శక్తి పెంచుకునేందుకు పచ్చిరొట్ట సాగుతో ఎంతో ప్రయోజనం చేకురనుంది. ముఖ్యంగా వరి సాగుకు నీటి తడులు ఎక్కువ అవసరం ఉంటుంది. నీటి తడులకు, నేల సారవంతం, పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించేందుకు ప్రభుత్వం జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు సరఫరా చేస్తుంది. 50 శాతం రాయితీపై 4,355 క్వింటాళ్ల విత్తనాలు ఆయా మండలాల్లో రైతుల డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉంచారు. గత నెల 26న దండేపల్లి మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ రైతులకు విత్తనాల పంపిణీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 929.4 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.

నేలలో తేమ శాతం పెరుగుదల

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు సేంద్రియ ఎరువులపై దృష్టి సారించా ల్సి ఉంటుందని జిల్లా వ్యవసాయ అఽ ది కారి సురేఖ వివరిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం పెరగడంతో పంట లకు తెగుళ్లు, పురుగుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. భూసారం పెంపునకు పచ్చి రొట్ట నుంచి లభించే ఎరువులు పంటలకు వేయడం వల్ల అధిక దిగుబడులు, నాణ్య మైన పంట ఉత్పత్తులు పొ ందవచ్చు. భూమి గుళ్లబా రుతుంది, భూసారం బాగా పెరుగుతుంది. మొక్క వేర్లకు గాలి, నీరు పుష్కలంగా అందుతాయి. చీడపీడల వ్యాప్తి సైతం తగ్గుతుంది.

వరిసాగులో కీలకం

జిల్లాలో 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం ఉంటుంది. సేంద్రియ ఎరువులను తగు పాళ్లలో భూమికి అందించడంలో చాలా మంది రైతులు విఫలమవుతున్నారు. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. ముందస్తు భూసారం పెంపునకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు పొలాల్లో చల్లుకుంటే నాటువేసే సమయానికి బురదలో కలియ దున్ని ఎరువుగా వినియోగించవచ్చు.

పెరిగిన విత్తన ధరలు..

గతేడాది 30 కిలోల జీలుగ బ్యాగుకు రూ.4,274 ఉండగా రాయితీపై రూ.2,137కు అందించారు. ఈ ఏడాది రూ.4,905 ఉండగా రాయితీపై రూ.2,450కు విక్రయిస్తున్నారు. జనుము 40 కిలోల బ్యాగు గతేడాది రూ.5,350 ఉండగా 2,860కి అందించారు. ఈ ఏడాది రూ.6,220 ఉండగా రాయితీపై 3,110కి ఇస్తున్నారు. పిల్లిపెసర 20 కిలోల బ్యాగు గతేడాది రూ.3,680 ఉండగా రాయితీపై రూ.1,820కి ఇచ్చారు. ఈ ఏడాది రూ.3,990 ఉండగా రాయితీపై రూ.1,995కి అందిస్తున్నారు.

పిల్లిపెసర..

ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం వేసుకోవాలి. పూతదశలో 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్ట ఇస్తుంది. దీన్ని పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు. ఒక టన్ను పిల్లి పెసరలో నాలుగు కిలోల నత్రజని, కిలో భాస్వరం, మూడు కిలోల పోటాష్‌ ఇస్తుంది.

విత్తనం క్వింటాళ్లు కొనుగోలు

చేసింది(క్వింటాళ్లలో)

జీలుగ 3,350 733.8

జనుము 840 185.2

పిల్లిపెసర 165 11

మొత్తం 4,355 929.4

ఇప్పటి వరకు జిల్లాకు చేరిన విత్తనాలు

జీలుగ

ఎకరాకు 12 నుంచి 15 కిలోల జీలుగ విత్తనం వేసుకోవాలి. పూతదశలో కోసినప్పుడు ఎకరాకు 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఒక టన్ను జీలుగ సాగులో ఐదు కిలోల నత్రజని, 1.5 కిలోల భాస్వరం, 4 కిలోల పోటాష్‌ వస్తుంది. చౌడు భూములకు బాగా పనికి వస్తుంది.

జనుము

ఎకరాకు 20 నుంచి 25 కిలోల విత్తనం వేసుకోవాలి. పంట వేసిన 8 వారాల తర్వాత కోస్తే 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట ఇస్తుంది. ఒక టన్ను జనుములో నాలుగు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, మూడు కిలోల పొటాష్‌

ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement