అ‘పూర్వ’ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ సమ్మేళనం

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

లోకేశ్వరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1986–87 బ్యాచ్‌ పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. బాగాపూర్‌ గ్రామంలోని ఓ తోటలో జరిగిన వీరి అపూర్వ సమ్మేళనానికి హాజరయ్యారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో గడిపిన మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు గంగారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శివలింగం, శంకర్‌రెడ్డి, లోలం గంగన్న, దేవేందర్‌రెడ్డి, రమణయ్య, కాశీరాం, కిష్ణారెడ్డి, సూర్యకాంత్‌లను సన్మానించారు. – లోకేశ్వరం

32 ఏళ్ల తర్వాత..

ఖానాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1993–94 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థులు 32 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆది వారం వీరి ఆత్మీయ సమ్మేళనానికి జి.వి.ఆర్‌. ఫంక్షన్‌ హాల్‌ వేదికై ంది. పాఠశాలలో గడిపిన తీపిగుర్తులు, అల్లరి పనులను గుర్తుచేసుకున్నారు. రోజంతా సంతోషంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ప్రహ్లాద్‌, దేవన్న, నరసింహరావు, విఠల్‌ను సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారం అందించాలని పూర్వవిద్యార్థులు తీర్మానం చేశారు. – ఖానాపూర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement