బెల్లంపల్లి: గుండెపోటుతో వ్యక్తి మృతిచెందగా, కు టుంబ సభ్యులు ఆయన నేత్రాలు దానం చేశారు. మున్సిపాలిటీ షంషీర్‌నగర్ బస్తీకి చెందిన జడల రమేశ్ ఆదివారం గుండెపోటుతో అకాల మృతిచెందాడు. అతని కళ్లు దానం చేసి అంధులకు కంటి చూపు ప్రసాదించవచ్చని జనహిత సేవా సమితి నిర్వాహకులు బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా వారు ముందుకొచ్చారు. వాసన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ చందు వచ్చి రమేశ్ నేత్రాలను సేకరించాడు. పుట్టెడు దు:ఖంలో కూడా నేత్రదానం చేసేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులకు జనహిత సేవాసమితి అధ్యక్షుడు ఆడేపు మహేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సర్టిఫికేట్ అందజేశారు. కార్యక్రమంలో జనహిత సేవా సమితి నిర్వాహకులు ఇప్ప రవి, కె.గిరిప్రసాద్, గురుస్వామి, సుకుమార్, కనకయ్యతోపాటు దేవసాని వెంకన్న పాల్గొన్నారు.
నేడు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత పర్యటన


