కాసిపేట: మోదీ అంటే ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉందని అందుకే నెహ్రూను మించి 12సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేశ్ తెలిపారు. మండల కేంద్రంలోని శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశమే ఇళ్లుగా, దేశ ప్రజలే కుటుంబంగా బతికేది కేవలం మోడీ అని అన్నారు. సమావేశంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దేవునూరి సంతోష్, రెడ్డి బాలరాజు, ఉపాధ్యక్షుడు ప్రసన్న, నాయకులు రాంచందర్, రాజేష్, ప్రశాంత్, సురేందర్, తోట మనోజ్, మహిళా మోర్చ నాయకురాళ్లు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


