సింగరేణి ప్రాంతానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

సింగరేణి ప్రాంతానికి పెద్దపీట

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

– మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

సింగరేణి ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కారుణ్య నియామక పత్రాలు పొందిన వారిలో జిల్లా నుంచి 117 మంది ఉన్నారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ప్రస్తుతం సింగరేణిలో మారుపేరు సమస్య ఉందని, ఒక కమిటీని వేసి త్వరలోనే పరిష్కారం జరిగేలా చూడాలని డిప్యూటీ సీఎంను కోరారు. రిటైర్డ్‌ కార్మికులకు తెల్ల రేషన్‌కార్డులు ఇవ్వాలని తాను సూచించగా, ఇచ్చిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలో 10 వేలకు పైగా క్వార్టర్లు ఖాళీగా ఉండి, వాడకంలో లేక అవి పాడవుతున్నాయని, వాటిని రిటైర్డ్‌ కార్మికులకు అందించి, ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరాంపూర్‌లోని సింగరేణి ప్రాంతంలో ఇళ్లపట్టాలను ఇప్పించి, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు అందించే బోనస్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచేలా చూడాలని కోరారు. రిటైర్డ్‌ కార్మికులకు ఆదాయపు పన్ను వెసులు బాటు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌, జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మాజీ మంత్రి వేణుగోపాల్‌చారి, ఐఎన్టీయూసీ, మినిమం వేజేస్‌ బోర్డు చైర్మన్‌ జనక్‌ప్రసాద్‌, ఏఐటీయూసీ అధ్యక్షు డు సీతారామయ్య, సింగరేణి సీఎండీ బుద్ద ప్రకాష్‌ జ్యోతి, గిరిజన సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కొట్నాక తిరుపతి, జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, మేయర్‌ దర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement