చట్ట వ్యతిరేకులపై కఠినంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

చట్ట వ్యతిరేకులపై కఠినంగా వ్యవహరించాలి

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

● రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

దండేపల్లి: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. శనివారం దండేపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, రిజిష్టర్లు, రిసెప్షన్‌ కౌంటర్‌ను పరిశీలించారు. ఎస్సై రాజవర్ధన్‌ను అడిగి పెండింగ్‌ కేసుల వివరాలు తెలుసుకున్నారు. పరిసరాలను పరిఽశీలించి, పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రైమ్‌ వాహనాలు, ప్రాపర్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, స్టేషన్‌ను వర్టికల్‌ వారీగా విభజించి సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు ఆధునీకరించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement