అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

లక్సెట్టిపేట: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గోపతి సురేష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంకతిపల్లి గ్రామానికి చెందిన గణవేని రమేశ్‌ (41) గత కొన్నిరోజులుగా నడుమునొప్పి, పలు రకాల వ్యాధులతో అనారోగ్యం బారినపడ్డాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించుకున్న నయం కాలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందాడు. శుక్రవారం ఉదయం బయటకు వెళ్లి మధ్యాహ్నం వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం లక్ష్మిపూర్‌ శివారు పొలం వద్ద పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ వి షయం తెలుసుకున్న కుటుంబీకులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మె రుగైన వైద్యం కోసం కరీంనగర్‌ ఆసుప్రతికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా రాత్రి మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో శనివారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement